ఓ కవీ కోకిలవే సుమా...
Theresh Babu Pydiకి
జ్ఞాపకాంజలి
ఓ కవీ
కోకిలవే సుమా
పంచమ స్వరం లోనూ
వ్యధా గాధా పద తాండవం లోనూ
నీ అడుగు నేలను వీడదు
నీ పదాలు సుకుమారపు మానవత్వం నుండీ
వెరపెరగని సైనిక కవాతుకి అలవోకగా
పరకాయ ప్రవేశమౌతాయి
పొయెటెస్స్ అని హృదయపూర్వకంగా పలకరించిన ఆనాటి పిలుపు...
కవిత్వం పట్ల
పదాల మెరుపుల్ని ఎక్కడున్నా అక్కున చేర్చుకునే
ఆప్యాయత లా ఇప్పటికీ గుబాళిస్తూనే వుంది
అభిమానపు అధరువుని అందరికీ మనసారా పంచే మనిషీ...
నువ్వు వెళ్ళిపోయావంటే నమ్మకానికే నమ్మకం కలగడం లేదు
పదాల విత్తుల్ని అలుపెరగక నారుమళ్ళనింపే పదకవితా శ్రామికా
ఎందుకిలా స్వర్గలోకపు తోటమాలి వయ్యావు...
వేలుపట్టుకుని కవిత్వాన్ని కిలకిలా రావాలు పలికించి
పైకెగరేసి ఆకాశాన్ని పదాలకు చూపించి
బాధల అగాధాల్ని అలవోకగా తర్జుమా చేసీ
అలిసిపోయావా...
హృదయం మెలిపెట్టినట్టుంది
అగాధాల్ని వెతకాలని బయల్దేరింది
అక్కడైనా మనసారా పంచే మానవత్వం తో పాటూ
నువ్వు కూడా యధాలాపపు చిరునవ్వుగా ఎదురవుతావేమో అని దురాశ!
Jayashree Naidu
https://www.facebook.com/groups/kavisangamam/831299166922837/?notif_t=like

Comments
Post a Comment