సీతా కళ్యాణ వైభోగమే..!



పానకం వడపప్పు.. భద్రాచలం లో వైభోగం గా జరిగే సీతారాముల కల్యాణం - శ్రీ రామనవమి అనగానే గుర్తొస్తాయి.. 

మన ఒక్కో పండగా.. ఒక్కో విందు భోజనం..  
మన సంస్కృతీ అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.. 
యోగ లో సూర్య నమస్కారాలుంటే..
ప్రొద్దుటే..  సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కరించితే.. ఆరోగ్యమే ఆరోగ్యం.. 
రామాయణం లో  రాముడు సూర్య వంసజుడైతే..
భారతం అంతా చంద్ర వంశస్తులది.. 
ఒక విధం గా పూర్తి భూగోళం.. మనదే.. 

రామాయణం అంతా  సీతా రాముల కథ గా కనిపించినా.. 
ఒక సమాజ పరిణామం వర్ణిస్తుంది..
అలాగే ఈ శ్రీరామనవమి కూడా మన అందరమూ కలిసి పంచుకునే ఆనందం..
 మనకున్న అన్ని పండుగలు.. ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకుంటారు.
 ఈ పండుగ ఒక్కటే.. పందిళ్ళు వేసి.. అందరూ ఒక్క చోట చేరి.. సీతారాముల కల్యాణం చూసి.. 
పానకం.. వడపప్పు.. ప్రసాదాలు అందుకుని.. ప్రతి సంవత్సరం.. ఆ కళ్యాణ కళని ఆనందిస్తాము!.  



చైత్రమాసం నుంచీ సూర్యుడి తాపం పెరిగే సమయం.. 
పానకం లోని బెల్లం మిరియాలు.. కలిసి.. శరీరానికి ఉష్ణాన్ని తట్టుకునే శక్తినిస్తాయి.
నానబెట్టిన పెసరపప్పు - దాని చలవ గుణాలు మనకు తెలిసినదే.. 
మన వాళ్ళు నిజంగా గొప్ప దైటిషియన్లు... ప్రతి పండుగకి ఒక ప్రత్యేకమైన డైట్ పెట్టారు! 


మోగే మంగళ వాద్యాలు.. మామిడాకుల తోరణాలు.. పందిరి అంతా పచ్చటి అక్షతలు.. 
సీతారాముల కళ్యాణ వైభోగం  ఆ రోజంతా నిజంగానే మన కుటుంబం లో జరిగే పెళ్లి అన్న భావన ని ఇస్తుంది.. 



Comments

Popular Posts