ఫేస్ బుక్ లో ఓ రోజు...-1


Mohana Tulasi Ramineni
జీవితం మలుపు తిరిగిందని, పాత గుర్తుల్ని పారేసుకోలేంగా! 
ఈమలుపు సరైనదే కావొచ్చు, ఈమలుపే రాసిపెట్టివుండొచ్చు 
అయితేనేం, పాతదారిలో జీవం వుండబట్టేగా, అదిప్పటికీ జీవిస్తున్న జ్ఞాపకమయ్యింది.



Mahesh Kumar Kathi: మలుపు మలుపుకీ గుర్తుల్ని పారేసుకున్నా,
 జ్ఞాపకాలమూటల్ని మాత్రం మనసు మోస్తూ ఉంటుంది. 
ఆ మూటే లేకపోతే హృదయంలో బరువేది! కళ్ళలో తడి ఏది! 
గుండెలో ప్రేమేది! జీవితంలో జీవమేది!!!


Mohana Tulasi Ramineni :
ఈ క్షణం యవ్వనం లాంటిది 
అందుకే అందం గా ముస్తాబు చేయాలి 
ఫోటో తీసి పెట్టుకోవాలిగా 
మళ్ళీ జీవితపు టంచుల మీద నిలబడి 
ఆల్బం తిరగేసినపుడు 
క్షణాలన్నీ పోటీ పడాలి తెల్చుకోలేనంతగా
ఎద నుండి వొచ్చే చిరునవ్వు మీదుగా 
వ్యధలన్నీ మాయ మయ్యేంతగా...



Mahesh Kumar Kathi:
జీవించిన క్షణాల కన్నా, మృత శకలాలనే ఎక్కువగా మోస్తూ ఉంటారు చాలా మంది.
 జీవితాన్ని చావులా బ్రతికేస్తుంటారు మరి కొంతమంది. 
వాళ్లకి ఈ క్షణం విలువ ఎం తెలుసు... ముస్తాబు చెయ్యడం కాదు కదా..
తెలీని భవిష్యత్తు కోసం ఈ క్షణాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నా మన్న భ్రమలోనే మిగిలి పోతారు.
 మసకబారిన ఫోటోలూ అధూరే ఆల్బం తప్ప అందమైన జ్ఞాపకాలు ఎక్కడుంటాయి! 

Comments

Post a Comment

Popular Posts