ఉగాది మనసు..



పోయిన ఉగాది కి గుమ్మాన కట్టిన   తోరణాల శోభ తరగనే లేదు 
 గుమ్మానికి రాసిన పసుపు   చేతికంటినది ఆరనే లేదు..
ముగ్గుల ముచ్చట మనసుని వీడి పోనే లేదు..
ఖరనామ సంవత్సరమా అన్న మాట వెనక.. ఖరము అంటే.. దాని అర్థం మది లో మెదిలి 
పెదవుల మీద మెరిసిన నవ్వు ముగియనే లేదు.. ఇంతలోనే.. మళ్ళీ ఉగాది వచ్చే సింది..



మార్పు...  మరుపు.. మలుపు.. 
వీటిని గెలిచినదే మనసు.. 

 కాలమా...  
ఎంత సేపు నీ పరుగుని అందుకోవాలన్న తపన..
నువ్విచ్చిన వరాలు.. కలవరాలు.. 
సుఖసంతోషాల కలబోతలు.. 
నా మనసు పేజీలో నిండినవి ఎన్నని చెప్పను..  
 మనసా..
పసిపాపలా నిన్ను పదిలంగా 
పొదివి పట్టుకున్న మనసుకు 
హత్తుకున్న క్షణాలు 
అంతులేని అనుభవాలు.. 
 నింపిన హృదయానికీ  

కన్నీరు నీ దరి చేరకూడదని..
అనుక్షణం తోడూ నీడవుతున్న స్నేహానికి.. 
కష్టానికీ సుఖానికీ 
నేనున్నాను సుమా అనే నేస్తానికీ 



 ఏ పండగ వస్తేనేం  ఏ రోజు అయితేనేం  
ప్రతి ఉదయమూ ఆనందమే.. 
ప్రతి క్షణమూ మధుర మధురమే..





Comments

  1. nice finesse of expression jayaa kudos....love j

    ReplyDelete
    Replies
    1. heartening words from u dear..

      love is the elixir for living

      it adds finesse to heart j... <3

      Delete
  2. "మార్పు... మరుపు.. మలుపు..
    వీటిని గెలిచినదే మనసు.. " మనసుని అంతరంగాన్ని చక్కగా విశ్లేషించారు. "మాటే మంత్రమూ, మనసే బంధమూ" పాట జ్ఞప్తికి తెచ్చారు. అభినందనలు

    ReplyDelete

Post a Comment

Popular Posts