నందన ఉగాది వచ్చే వచ్చే... -1



ఉగాది పండుగ వచ్చేస్తోంది...
ఇంకెంత ఒకటి.. రెండు.. మూడు.. రోజులు మాత్రమే.. 

ఉగాది మన పండుగ.. అచ్చ తెలుగు పండుగ..
తెలుగు సంవత్సరాది.. ఈ సంవత్సరం *నందన* నామ సంవత్సరం.. 
ఎంతైనా మనం ఆశా జీవులం కదా. 
పేరులోనే కాకుండా స్ఫూర్తి లో కూడా నందనాన్ని ఇలకు దింపుతుంది అనే ఆశిద్దాం..

ఉగాది పండగ అనగానే ముందు గుర్తొచ్చేది .. ఉగాది పచ్చడి..
వేప పువ్వు.. మామిడి కాయ.. కొత్తబెల్లం, కొత్త చింతపండు, మామిడి చిగుర్లు  చెరుకు అరటి పళ్ళు ఇలాంటి చిత్రమైన కాంబినేషన్ తోటి.. 

తీపి -- బెల్లం
పులుపు -- చింతపండు..
 ఉప్పు కారం -- ఇది ప్రత్యేకం గా చెప్పక్కర లేదు..
వగరు మామిడి చిగుళ్ళు  చేదు-- మనందరికీ తెలిసిన వేప పూత.. 
పండగరోజు విచిత్రమైన నింబ  కుసుమ భక్షణం.. (ఒక్క ముక్క అర్థం ఐతే ఒట్టు.. అనకండి.. )


రాబోయే వేసవి తాపానికి... వెళ్ళిపోయిన చలికాలం శరీరం లో వదిలి వెళ్ళిన క్రిమి సంహారానికి ఇది మంచి రసాయన విరుగుడు లా పనిచేస్తుంది.. 
అది కూడా.. ఉగాది పండుగ రోజు ప్రొద్దున్నే... తలారా స్నానం చేసి.. 
ఖాళీ కడుపుతోటి సేవించాలి.. ప్రసాదం లా... 

అంతే కానీ ప్రొద్దుటి కాఫీ టీలు తాగేసి టిఫిన్లు తినేసి... తీరికగా.. పది పదకొండు గంటల కు తింటూ.. 
ఇదేదో మన వెరైటీ కాంబో ప్యాక్ అనుకోవడం కాదు ..





ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి :-
మంచి నవనవ లాడే మామిడికాయ  (ఓ మీడియం సైజ్ ది), ఓ పదిహేను   వేపుపుతకాడలు, గోలీ అంత కొత్త చింతపండు, కొత్త బెల్లం, రెండు పచ్చిమిరపకాయలు, ఒక అరటిపండు మరియూ ఉప్పు, నీళ్లు ( రెండు గ్లాసులు ).

తయారీ విధానం:
ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. కాబట్టి, ఒక పెద్ద సంచినిండా పూత తెస్తే ఓ దోసెడు  వేప  పూత వస్తుంది. సరే ఈ పూతని సిద్ధంగా పెట్టుకోండి. 
 మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి..తొక్క తీయడం మరవకండి.  
 వంద గ్రాముల  చింతపండులో రెండు గ్లాసుల  నీళ్ళు పోసి  నానబెట్టాలి. 
ఒక పసినిమిషాల తర్వాత పిసికేసి, పిప్పి పారేసి ఆ చింతపండు గుజ్జుని   ప్రక్కన పెట్టుకోండి. 
ఇప్పుడు బెల్లాన్ని గుండ్రాయితో బాగా నలిపి  దాన్ని చింతపండు గుజ్జులో  కలిపెసేయ్యాలి.
తర్వాత మిర్చిని సన్నగా తరుక్కోవాలి.. అలాగే అరటిపండు తొక్క తీసేసి.. అరటి పండుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.. 
ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో  మామిడి కాయ ముక్కలు , అరటి పళ్ళ ముక్కలు, వేప పూత  ఇంకా మిగితా పదార్థాలన్నీ వేసి ఒక చిటికెడు ఉప్పు వేసి కలపాలి.. 
ఇష్టమైన వారు చెరుకు రసం, చెరుకు ముక్కలు, ఇంకా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసి మంచి తీయటి ఉగాది పచ్చడిని ప్రసాదం గా  ఆరగించ వచ్చు.. 

Some people have strange sentiments over the taste of this medicinal concoction UGADI PACHCHADI..
my  friend says.. if  it tastes sweet.. then that year is going to be the best for him.. or else any other taste... bitter.. bitter sweet.. or sour.. he continues to break his head blaming it on the ugadi pachchadi.. :)




Comments

Popular Posts