మలుచుకుంటున్నాను.. నిశ్శబ్దంతో...



 కలవడమంటె.. ఒక పండగ
 ఆ క్షణాన్ని రక రకాలుగా ఊహలు
ఇలా అంటే.. నువ్వలా అంటావేమో..
అలా అంటే..ఇంకేమన్నానో..
ప్రతి ఆలోచనకీ పెరిగే గుండె ఆనందం

వచ్చినప్పటి ఆనందం వెంట వచ్చిన క్షణాలు కొన్నే
నీలా ప్రేమ ని నిశ్శబ్దంగా నిబ్బరంగా మోయగలిగే
రోజు కోసం.. నన్ను నేను మలుచుకుంటున్నాను.. నిశ్శబ్దంతో...

Comments

Popular Posts