ఇది నల్ల మిరియం చెట్టు


మేఘం నలుపు
మౌనం నలుపు
దూఃఖం నలుపు
అక్షరం నలుపు
నిలువెల్లా నలుపు లోని చ్హాయలు

మొదటి పేజీ నుండీ చివరి పేజీ వరకూ ఒక శోధన



అనేక వేదనలు, హృదయాన్ని మెలిపెట్టే రోదనలు, ఏవేవో వాసనలు -- కమిలిపోయిన ఆత్మలు,

కరుడుగట్టిన స్వార్థాలు

బొగ్గై కన్నీరు నిద్దరోతుంది

అక్షరం పుస్తకమై భగ్గుమంటుంది!

ఇది నల్ల మిరియం చెట్టు



" ఇదొక దుఃఖపు పాట, ఒక తిరుగుబాటు కథ, విధ్వంసం, 
మరణం గురించి కూడా

మన బాధ గొప్పది, పాల కోసం ఏడ్చే పిల్లవాది అరుపు కన్నా

నేనో పురాతనమైన నమ్మకాన్ని, ఒక భయాన్ని


వందల సంవత్సరాల ముసలి తనం నాది, నా శిరస్సు ఇన్ని యేళ్ళుగా అవనతమై వుంది,

నేనొక యువకుణ్ణి ఇప్పుడు, భవిష్యత్తును స్పష్టంగా తల పైకెత్తి చూడగలుగుతున్నాను.


పాటను ఆపొద్దు, విరామం యివ్వద్దు, ప్రయాణం ఆపొద్దు

రేపు మనం ఇలా కూడా కలుసుకోలేమేమో.."

00~~~~~00



Comments

Popular Posts