ఆకుపచ్చ రాక్షసి..
అదో ఆకుపచ్చ రాక్షసి..
వేయి పడగలై వొళ్ళు విరిచింది
కోటి కోర్కెలతో యుద్ధం
శత కోటి నక్షత్రాల సైన్యం
ఆరబోసిన వెన్నెల్లో వెలుగు గుర్రాలు
చీకటి బాణాలు గుచ్చుకుంటున్నా
మరణం లేని వెలుగు వీరులు
కనుచూపుమేరా ఆశల ఖజానా కాపాడుతూ..
-- జయశ్రీ నాయుడు
Comments
Post a Comment