నీ తపస్సులో నువ్వుంటావు
రాత్రి కి రాత్రిలోని చీకటికి ఒక ప్రత్యేకత అంటూ వుందనీ చెప్పే విచిత్రమైన పండుగ శివరాత్రి....
అన్ని పండుగలూ దాదాపు పగటి పూట పూజలకి సంబరాలకీ పరిమితమైతే... అర్ధరాత్రి కళ్యాణ ఘడియ పెట్టుకున్న పెళ్ళి కొడుకు శివుడు!
దేవతలకి వరాలిచ్చే దేవుడు హరి, దానవులైనా భక్తి తో ఆర్తితో తపిస్తే కరిగిపోతాడు హరుడు.. !
మహా శివుడి శక్తి గా నిలిచే పరమ శక్తి ఆది శక్తి పార్వతి ఓ యోగ శక్తి
మూలాధార శక్తి ధార గణపతి మరో అద్భుత తత్వం
ఈ శివుడి తత్వమే వేరు.. అన్నీ వుంటాయి చుట్టూ.. తను దేనికీ చెందడు
ఒంటరి శ్మశాన సంచారి, ఆది శక్తికి అర్థభాగాన్నిచ్చిన అర్థనారీశ్వర మూర్తి...
విలయమే తన నిలయం..
ఆది యోగి.. పరమ యోగి.. ఈశ్వరత్వమ్... నశ్వరత్వమ్... ఓమ్ కారమ్..
అఖండ చేతనత్వమ్ తన సొంతం
ఎన్నో పూజల పద్ధతులు చూశాను, చేశాను.. యేదీ శివత్వమంత నిర్మల భావాన్ని కలిగించలేదు..
చెంబుడు నీళ్ళకే కరిగి పోతాడు, గంధానికే చల్లబడి శ్వేత దళాల్లా చల్లగా నవ్వుతాడు...
తనంత నిర్మలంగా వున్న మనసుకి దాసోహం అంటాడు
ఆకాశం లా విప్పుకున్న మనస్సుకి పాల పుంతలా విస్తరించిన చూపు కలిపి చూడగలిగితే..
అంతా శివత్వమే...
నీ తపస్సులో నువ్వుంటావు
నీ తపస్సులో నేనుంటాను..

జయశ్రీ గారు శివతత్వాన్ని బాగా ఆవిష్కరించారు. విలయమే తన నిలయం..ఈశ్వరత్వమ్... నశ్వరత్వమ్.... చాలా బాగుంది.
ReplyDeleteThank you Nandiraju garu.... Sorry for this late reply...
ReplyDelete