భోగి తో మొదలై కనుమ వెంట తెచ్చే 'సన్'క్రాంతి!


సూర్యుడు మండే అగ్ని గోళం 
మనమున్నది.. ఆ సూర్యుడి చుట్టూ తిరిగే భూగోళం 

వృత్తం మూడువందల అరవై డిగ్రీల కొలమానం 
సంవత్సరం లో కూడా షుమారుగా మూడువందల అరవై ఐదున్నర రోజులు.. 

సంవత్సరాన్ని రెండు భాగాలూ చేసి 
దక్షిణాయనం ఉత్తరాయణం అన్నారు 
ఈ రెండు కూడా సూర్యుడ్ని బేస్ చేసుకుని తయారు చేసినవే
దక్షిణ భారతానికి సూర్యుడికి దగ్గర సంబంధం వుంది.. బహుశ భూమధ్య రేఖ దగ్గరగా వుండడం వల్ల కావొచ్చు 
మన ముగ్గులు కానీ...  పండుగలు కానీ వాతావరణ మార్పులకి అనువుగా వుంటాయి




సంక్రాంతి పండుగ వచ్చేది చలి కాలం... ధనుర్మాసం రోజుల్లో ముగ్గులతోటి వాకిళ్ళు కళకళ లాడతాయి..
చలిలో వాకిలి ఊడ్చి ముగ్గులతోటి అలంకరించే సరికి మగువలకి కాలవలసినంత వ్యాయామం 
దీని కోసం ప్రత్యేకం గ జిమ్ లకి వెళ్లనక్కర్లేదు.. కళ కు కళ... ఆరోగ్యానికి ఆరోగ్యం!

ఆహారం చూస్తే... చలి కాలం కి తగిన వెరైటీలు 
ధనుర్మాసం లో పూజ లో నైవేద్యం పులగం - బియ్యం పెసరపప్పు నెయ్యి కలగలిపిన పులగం 
కార్బో హైడ్రేట్లు ప్రోటీన్లు తోటి రిచ్ ఫుడ్.. తేలికగా తయారు చేసుకోవచ్చు 
ప్రసాదం రూపం లో ఆరోగ్య వరం! 

* నేచర్ ని గౌరవించే పండుగ 'భోగి' 
ఇంట్లోని పనికి రాని కలప సామాను ఆంతా పోగు చేసి ఆవు పేడ పిడకలు  వేసి మంట పెడతారు 
ఇంట్లోని నెగటివ్ ఫోర్సెస్ పోయి శుభ్ర పడుతుంది.. 
మరుసటి రోజు సంక్రాంతి రోజు ఆచారాలతో పోసిటివ్ ఎనర్జీ నిండుతుంది.

భోగి రోజు సాయంత్రం వేళ చిన్న పిల్లలకు పోసే భోగిపళ్లు పెద్దల ఆశీర్వాదం పిల్లలకు అందించడమే కాకుండా 
రేగుపళ్ళ ని భోగి పళ్ళు చేస్తాయి.. రేగు మొక్క లో నెగటివ్ ఎనర్జీ ని అబ్సార్బ్ చేసుకునే గుణం ఎక్కువ! 
సంక్రాంతి బొమ్మల కొలువుకి ఇదే మొదటి రోజు... 
చిన్న పిల్లలందరికీ మన సంస్కృతి ఆచార వ్యవహారాలు పరిచయం చేసే స్నేహితులీ బొమ్మలు.. 



*మకర సంక్రమణం చూపడానికి 'సంక్రాంతి' 
 The second day, Sankranthi or Makara Sankranthi, is dedicated to the worship of 'Surya', the Sun God. The day marks the Sun's journey to the Capricorn ('Makara' raasi) of Northern Hemisphere, signifying the onset of 'Uttarayana Punyakalam',
సూర్యుడు ఆరోగ్య ప్రదాత! 
ఈ సంక్రాంతి రోజుల్లో సూర్య కాంతి తీక్షణం గా వుండదు 
గోరువెచ్చని ఎండా కొంత చలి తోటి వాతావరణం ఆహ్లాద కరం గా వుంటుంది 
ముగ్గులు వేసి రంగులతోటి నింపి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వనిస్తాము...   
పండుగకు ఇంటికి వచ్చిన కొత్త జంటలు ఇంట్లో సందడి చేస్తుంటే కుటుంబమంతా ఆనందం నిండుతుంది 

కజ్జి కాయలు సకినాలు జంతికలు అరిసెలు.. రిచ్ డైట్ 
అరిసెలు లేని సంక్రాంతి పండగే కాదు.. 
ఆత్మారాముడు ఆనంద పడటం కన్నా పండుగ ఉంటుందా...! 




* పండుగ వైభవం 'కనుమ'! 
పంట చేతికి వచ్చిన ఆనందం లో రైతు వుంటాడు 
పశువులకు పక్షులకు సమ్రుద్ధ్హి గా ఆహారం దొరికే రోజులు 
తన కు సదా సేవ చేసే పాడి  పశువులకు రైతు తన కృతజ్ఞత తెలుపుకునే రోజిది  
పశువుల్ని అలంకరించి పొంగలి వండి ప్రేమార తినిపిస్తాడు 
పొలాల్లో కోతలు కోయగా మిగిలిన ధాన్యాన్ని పక్షులకు వదిలే ఆచారం కూడా వుంది   
కొంత స్వార్థం వదులుకోవాలన్నది అంతర్లీనం గా చెప్పడం...
కనుమ రోజు మినుము తినాలని సామెత... 
అందుకే ఈ  రోజు మినప గారెలు వండుతారు.. 
దానికి తోడుగా కోడి కూర... ఎంతైనా జిహ్వ చాపల్యం :)




ఒక విధం గా సంక్రాంతి సూర్యుడి పండుగ! 
ఇక్కడ హీరో సూర్యుడే 
అతడి ఆరాధన కే ఈ మూడు రోజులు కేటాయించింది 
భూమ్మీది ప్రకృతికి కేంద్రం సూర్యుడు... అందుకే సూర్యుడి తో పాటు ప్రక్రుతి ఆరాధనా రంగవల్లుల రూపం లో...!

ఈ ఆచారాలన్నీ నేచర్ కన్సర్వేషన్ కావా...
మన ఆచారాలన్నీ వేస్ట్ అని కొట్టి పారేసే ముందు.. ఒక్క సారి ఆలోచించండి! 

Comments

  1. జయశ్రీ చాలా బాగా చెప్పారు మన పండుగలోని మర్మాలని సందేశాలని తెలిపే విధంగా చాలా బాగుంది ....కాకపోతే ఒకటే బధేసింది నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం నాకు కొంచం పంపించి ఉంటే ఇంకా ఆనందించేదాన్ని హహహ ....ఆచారాలను అర్ధం చేసుకునేలా పిల్లల్ని మనమే దిద్ది తీర్చుకోవాలి మా ఇంటీ వెనుక కుటుంబం వారు వేసిన భొగి మంట ఫొతొ తీసి వెంటనే పెట్టాను ముచ్చటేసి .....సంక్రాంతి శుభాకాంక్షలు .....ప్రేమతో ...జగతి

    ReplyDelete
  2. చాలా బాగుంది అండీ మీ వివరణ. ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు లేకే యువతరానికి మన పండుగల విలువ తెలియట్లేదు. దానికి తోడుగా మన సంస్కృతి మీద ముప్పేట దాడి చేసే జన అజ్ఞాన సమితులకి కొదవలేదు. ఇలాంటివి వీలైనంత ఎకువగా కుర్రకారు చదివేల మనం చర్య తీసుకుంటే మళ్ళీ మనదేశానికి మంచిరోజులోస్తాయి. - శ్రీనివాస్ ఈడూరి

    ReplyDelete

Post a Comment

Popular Posts