పరుగెత్తుకొని వచ్చిన కాలం
కలిసిన కౌగిలి లో కరిగిపోయింది
క్షణాలు వెన్నెల రేణువులయ్యాయి
మధువుల కనువులయ్యాయి
పెదవులు మూగవై
తనువు పెదవి విప్పింది
తరంగాలు సోకిన అంతరంగం
ఉవ్వెత్తున ఎగిసిన జలపాతం
దోసిట్లో పొదుగుకున్న అనుభూతులు
కలలో ఆడుకున్న మనసు కేరింతలు
వరం లా కలిసిన కాలం
అదో మోహన రాగం ...
మీ మోహనరాగం ఈ పేజీలోంచి బయటకు వచ్చి వీనులవిందుగా ఉంది....చాలా సున్నితమైన పదజాలాన్ని ఎంచుకున్నారు.
ReplyDeleteమీ స్మూత్ కామెంట్ కి ధన్యవాదాలండీ దేవ్ గారు!
ReplyDeleteఆనందం.... అన్న భావం లలితంగా ఒక అల పాదాన్ని తాకి వెనక్కు వెళ్ళినంత
నిశ్శబ్దం గా వుంటుంది...
పదాలు కూడా అంటే లలితం గా వుండాలి అన్నది అప్పుడప్పుడు నా అంతరంగం నాకూ పెట్టే నియమం :)