మహదేవ...
శబ్దాన్ని కరిగిస్తూ...
చీకట్లని స్పృశిస్తూ...
ఎద చప్పుడు ఎప్పుడు నిదరోయిందో
వెలుగెప్పుడు రేకులు విప్పిందో
ఎప్పటి ప్రయానమో ఇది...
కనిపిస్తావు..
నీ కరుణతో కరిగిస్తావు
అడిగిందల్లా ఇస్తావు
అమ్మలా అక్కున చేర్చుకుంటావు
దోసెడు నీటికే కరిగే ముక్కంటివి
'శి' నుంచి 'వ' పలికే లోగా సాక్షాత్కరిస్తావు!
చాలా బావుంది. మంత్ర పఠనం ఆగినాక మిగిలిన నిశ్శబ్దమే శివుడు!
ReplyDelete