అనుదినం అన్నీ విజయాలే విజయాల ఒక్క రోజులో ఎన్నెన్నో విజయాలు, ఉదయాన్నే నిద్ర లేవటం విజయం, బద్దకించకుండా వ్యాయామం చెయ్యటం విజయం, నిర్లక్షం చెయ్యకుండా దేవుడికి ధీపారాధన చెయ్యటం విజయం, ఆలస్యం కాకుండా ఆఫీస్ చేరటం విజయం, చేస్తున్న పనిలో లీనమవటం విజయం, “పని బాగా చేశావు” అనిపించుకోవటం విజయం, వాయిదా వేస్తున్న పనులు ఈ రోజే పూర్తి చెయ్యటం విజయం, తోటి వారికి చిన్న సాయం చెయ్యటం విజయం, ఒక్క రూపాయన్నా దానం చెయ్యటం విజయం, మంచి పుస్తకంలో ఒక్క పేజీ అన్న చదవటం విజయం, శ్రావ్యమైన సంగీతం ఐదు నిమిషాలన్నావినటం విజయం, “ఇది నా కోసం” అని తృప్తి నిచ్చే చిన్న పనైనా చెయ్యటం విజయం, బుజ్జిగాడి చేత b,d తికమకపడకుండా హోమ్‌వర్క్ చేపించడం విజయం, భర్తగారితో ఉల్లిపాయన్నా తరిగించడం విజయం, సమయం లేదు, తీరిక లేదు అని అనకుండా ఈ రోజు గడపటం ఓ గొప్ప విజయం , రాత్రి నిద్రపోయేముందు ఈ రోజు నిర్వహించాల్సిన భాద్యతలన్నీ నేను ప్రేమగా పూర్తి చేసాను, అని తృప్తి చెందటం ఈ రోజు సాథించిన అతి గొప్ప విజయం. అనుథినం ఇన్ని విజయాలతో సాగేపోతుంటే, జీవితమే అందమైన విజయం.....
ప్రతి రోజు... క్షణ క్షణం కుస్తీ పడేదీ ఈ విజయాల కోసమే :)
ReplyDelete