Day 01
అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెట్టుకోవాలి.. మనసుకి..
అర్థం చేసుకోవడమే కాదు....
ఎంత అర్థం అయిందో తెలియాలి
అందుకే నలభై రోజుల పరీక్ష
.... మొదలు పెట్టాలను కున్నాను
అనుకున్నాను అనే కంటే అనిపించింది అనడం సబబు
సరే.. ఇప్పటికైనా నాకు బుద్ధ్హిని వెతికి పెట్టు.. ఫక్కున నవ్వింది మనసు..
పోవోయ్ అంది అహం
చూస్కో తెల్లారు ఝామున ముడున్నరకి.. నా తడాఖా
తీర్మానం అయ్యింది..
నిన్నా మొన్నా
మెలకువే రాలేదు..
ఎప్పటిలాగే నాలుగున్నరకి లేచి..
ప్రపంచపటం లోకి దారి వెతుక్కుంటూ పోవడం.. ...
మనసు బుద్ధీ - అహం కేసి ప్రేక్షక పాత్రా... చూసావా...
గట్టిగా సజెషన్ ఇచ్చుకున్నా.. తెల్లారుఝామున మూడున్నర
మూడున్నర
మూడున్నర..
టక్ మని మెలకువ వచ్చింది..
గడియారం ముద్దుగా నవ్వింది.. వావ్ మూడున్నర..
కానీ ఒళ్ళు బద్ధ్హకం గా వుందే
బెడ్ మీదే సెటిలై పో
మనసు రొద
లేదు పూజ మందిరం దగ్గర... బుద్ధి గద్దింపు
మధ్యలో అహం లేచింది.. అసలు చెయ్యకుండా వదిలేయడం కంటే
జస్ట్ గివ్ అ ట్రై...
కళ్ళు మూసి కూర్చున్నా.. బెడ్ మీదే
పెద్దగ కన్సేన్త్రేషన్ అయినట్టు లేదు..
జర్నీ కంటిన్యూ...
లోపలి.. చీకటి.. ఒక నిముషంలో సర్దుకున్న ఫీలింగ్
నిశ్శబ్దం నవ్వింది..
అలా ఫేసెస్ వెళ్తున్నాయి..
తేరి పార చూసాను..
మనసుకి నచ్చిన వాళ్ళు..
నా జీవితానికి ఆనందం దిద్దిన వాళ్ళు
ఇంకో ఆనందపు అల నెమ్మదిగా కదిలింది..
లోలోపలికి వెళ్తోన్న ఫీలింగ్
ఉల్లిపొరల్లా విడిపోతోంది.. అంతరంగం
అలా తాదాత్మ్యం అయ్యేలోగా
సడన్ గా ఒక ఆందోళనా కెరటం..
కారణం లేదు..
నిశ్శబ్దాన్ని చీల్చేసింది..
నేనులోకి వచ్చిపడ్డాను...
త్వమేహం..మరింతే ఇలాగే జరగాలి జరుగుతుంది కూడా.ఈ సంఘర్షణ మనిషి పుట్టినప్పట్నుంచి ఉన్నదే...కనిసం మనసుని గుర్తించినప్పట్నుంచీ మనలో మనకి మొదలయ్యేదే...
ReplyDeleteరాపిడి ఉన్నపుడే రవ్వ మెరిసేది..
Deleteకానీ ఒక్కోసారి ఆ బాధ తట్టుకోవడం కష్టం అనిపిస్తుంటుంది.. కూడా!